నేడే మెగా డీఎస్సీ సిలబస్ విడుదల!!! 25 d ago
రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా, 3,68,661 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో మొత్తం 1,87,256 మంది అర్హత సాధించారు. ఈ నేపధ్యంలో మెగా డీఎస్సీ సిలబస్ ను బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. మెగా డీఎస్సీ ప్రకటన జాప్యం కారణంగా అభ్యర్ధుల కోసం ముందుగా సిలబస్‌ను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్ధులు సిలబస్‌ను https://apdsc2024.apcfss.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.